Monday, July 28, 2025
E-PAPER
Homeసినిమాక్రైమ్‌ థ్రిల్లర్‌గా 'వన్‌ వే టికెట్‌'

క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘వన్‌ వే టికెట్‌’

- Advertisement -

వరుణ్‌ సందేశ్‌, కుష్బూ చౌదరి జంటగా ‘వన్‌ వే టికెట్‌’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ పద్మ ఫిల్మ్స్‌, రంగస్థలం మూవీ మేకర్స్‌ పతాకాలపై ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తు న్నారు. ఏ.పళని స్వామి దర్శకుడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు వచ్చిన ముఖ్య అతిథులు నిర్మాత సి. కళ్యాణ్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, హర్షిత్‌ రెడ్డి స్క్రిప్ట్‌ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ రావు అతిథిగా విచ్చేశారు.
వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ, ‘ఈ టైటిల్‌తో పాటు పళని చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ స్క్రిప్ట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో కొత్త పాత్రను పోషిస్తున్నాను’ అని అన్నారు. ‘శ్రీ పద్మ ఫిల్మ్స్‌, రంగస్థలం మూవీ మేకర్స్‌ బ్యానర్లపై ఇది మా రెండో చిత్రం. మంచి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని నిర్మాత శ్రీనివాసరావు చెప్పారు. దర్శకుడు ఏ.పళని స్వామి మాట్లాడుతూ, ‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఇది ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తుంది. మనోజ్‌ నందం, సుధాకర్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -