తీర్పు వెలువరించిన న్యాయమూర్తి శిరీష..
నవతెలంగాణ – రామన్నపేట
మహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటనపై నమోదైన కేసులో విచారణ అనంతరం స్థానిక అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి విచారణ అనంతరం దోషులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 సంవత్సరంలో నర్సాపురం గ్రామానికి చెందిన ఒక మహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటనపై నమోదైన కేసులో అదే గ్రామానికి చెందిన కవాటి మహేశ్, కవాటి నరేశ్, కవాటి శివ, ఎనుగుల ఉప్పలయ్య, జక్కుల రామకృష్ణ, కవాటి సుదర్శన్ అనే ఆరుగురు నిందితులపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నాటి ఎస్సై పి. శివనాగ ప్రసాద్ దర్యాప్తు చేపట్టి ఆధారాలను సేకరించి, సాక్ష్యాలతో కోర్టులో చార్జ్‌షీట్ సమర్పించారు. విచారణ పూర్తి చేసి నిందితులందరినీ దోషులుగా నిర్ధారించిన రామన్నపేట అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జ్ ఏస్. శిరీష ఒక్కొక్కరికి ఒక సంవత్సరం చొప్పున జైలు శిక్ష తోపాటు 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
దోషులకు సంవత్సరం జైలు, జరిమాన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



