Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం డోన్గాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాబురావు పటేల్, అజిజ్ భాయ్ జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లోకి చేరుతున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నుండి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి బాటలో ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిందని గుర్తు చేశారు. గత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి చేరుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం బీఆర్ఎస్ తోని సాధ్యమని ఆశ భావం వ్యక్తం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -