Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు..

కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని భూభారతి రెవెన్యూ సదస్సులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలోని పడంపల్లి గ్రామంలో కంఠాలి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కంఠాలి గ్రామంలో డిప్యూటీ తాహసిల్దార్ హేమలత మాట్లాడుతూ.. గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించుకునేందుకు భూ సమస్యలు ఉన్నవారు రైతులు దరఖాస్తులను వ్రాతపూర్వకర్వక సదస్సులో పాల్గొని దరఖాస్తులను పెట్టుకోవాలని సూచించారు. భూవివాద సమస్యలు ఉన్నవారు పట్టా పాస్ బుక్ సర్వే నంబరు లోపాలు , పాసుబుక్కులో పట్టాదారుని పేరు తప్పు దొర్లడం, ఇతర సమస్యలు తప్పుగా ఉన్నవారు ఇంకేమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి భూభారతి రెవెన్యూ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, సదవకాశాన్ని మండలంలోని గ్రామాల ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పడంపల్లి భూభారతి సర్వేలో రెవెన్యూ అధికారులతో పాటు, జిపి సెక్రెటరీ గంగాధర్,  గ్రామ పెద్దలు రాజు పటేల్, పౌడే సంజీవ్ పటేల్, హెచ్. మహేష్, హెచ్, వినాయక్, లక్సెట్టి బస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -