Sunday, October 26, 2025
E-PAPER
Homeజిల్లాలుకొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

- Advertisement -

ఉమ్మడి మద్నూర్ మండలంలో ఊరూరా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు
నవతెలంగాణ – మద్నూర్

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ హాయంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయి. మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ఊరూరా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మండలంలో గల ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగడం అర్హులైన నిరుపేదల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రజా ప్రభుత్వం నిరుపేదల పట్ల ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటుందని, ప్రజా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఏండ్ల తరబడి ఇల్లు లేని నిరుపేదలు ప్రభుత్వ ఇండ్ల మంజూరు కోసం ఎదురు చూడగా .. గత ప్రభుత్వాలయంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాలేదని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిరుపేదల పట్ల సంక్షేమ ఫలాలు అందిస్తుందని, ఇల్లు లేని నిరుపేదలకు ఊరూరా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణాలు చేపడుతుందని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో నిరుపేదల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -