Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ ఎంపీడీవో ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్ లతో కలిసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను మార్కౌట్ వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచులు అనిల్, గోపాల్ రావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను త్వరితగతిన  పనులను ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు.

ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న లబ్ధిదారులకు మూడు నిధులను విడుదల చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డబ్బులు మంజూరు కావని లబ్ధిదారులకు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ , కత్తల్ వాడి గ్రామ సర్పంచ్ గోపాల్ రావు, జిపి కార్యదర్శి రమేష్ చారి , జిపి పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -