Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకాలు

కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పాడిరంగంలో అభివృద్ధి సాధించాలంటే పాడిపశువుల సంపూర్ణ ఆరోగ్యం అత్యంత కీలకమైయింది. ఈ వ్యాధి నివారించడానికి పశువులకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వ్యాధి నివారణకు టీకా వేసే కార్యక్రమాన్ని చేపడతారు.మండలంలో బుధవారం నాటికి 15 శాతం గాలికుంటు టీకా పూర్తి చేసినట్లుగా మండల పశువైద్యాధికారి అభిలాస్ నవ తెలంగాణతో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో మొత్తం 9,900 పశువులు ఉండగా ఇందులో తెల్ల పశువులు 2,900 ఉన్నాయన్నారు. ప్రస్తుతం 1,490 పశువులకు,15 శాతం టీకా వేశామన్నారు.గొర్రెలు,మేకలు 38 వేలు ఉన్నాయన్నారు. మండల వ్యాప్తంగా ఒక జూనియర్ పశు వైద్యాధికారి,ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్స్,ఒక అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య సేవలు అందించడం ఇబ్బందిగా ఉందన్నారు. ప్రస్తుతం ఒక అటెండర్,ఒక లైవ్ స్టాక్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారన్నారు. తుది గడువు నవంబర్ 14 వరకు 100 శాతం పశువులకు గాలికుంటు నివారణ టీకా వేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -