– రూ.12.64 కోట్ల ఆదాయం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతర హుండీ లెక్కింపులలో భాగంగా మంగళ వారం నాటికి ఆదాయం రూ.12.64 కోట్లకు చేరుకుంది. జాతరలో మొత్తం 828 హుండీ లను ఏర్పాటు చేశారు. మంగళ వారం నాడు లెక్కింపులో రూ.80,81,935 ఆదాయం వచ్చినట్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు రోజుల్లో ఆదాయం రూ.12.64 కోట్లకు చేరుకుంది. ఈనెల 5వ తేదీన 125 హుండీలలోని కానుక లను లెక్కించగా రూ.2,49,65,000, 6వ తేదీన 160 హుండీలలోని కానుకలను లెక్కించగా రూ.3,54,25,200 (విదేశీ కరెన్సీ మార్పిడి రూ.63,436), 7వ తేదీన 140 హుండీలలోని కానుకలను లెక్కించారు. ఇందులో రూ.2,01,21,440 (విదేశీ కరెన్సీ మార్పిడి రూ.71,283), 8వ తేదీన 200 హుండీలను లెక్కించగా, ఇందులో రూ.2,64,75,757 ఆదాయం వచ్చింది. 9వ తేదీన 163 హుండీలలోని కానుకలను లెక్కించగా రూ.1,12,63,000, 10వ తేదీన 40 హుండీలను లెక్కించగా రూ.80,81,935 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. పర్యవేక్షణాధికారుల సమక్షంలో ఈ ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హుండీలలో భద్రపరచి వుంచగా, వాటి విలువ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. నాణెల లెక్కింపు, ఇ-హుండీ లెక్కింపులు ప్రారంభించలేదని పేర్కొన్నారు.
కొనసాగుతున్న మేడారం హుండీ లెక్కింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



