నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామస్తుల, ఆయకట్టు రైతుల అభ్యర్థన మేరకు తాడిచెర్ల ఊర చెరువు కట్ట మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల తాడిచర్ల గ్రామస్తులు చెరువు మరమ్మత్తు పనులు చేపట్టాలని కాపురం ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.దీంతో రెండు రోజులుగా చెరువు కట్ట మరమ్మత్తు పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువుకు ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లను తొలగించారు. కట్టపై రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పనులు వేగంగా చేపట్టడం పట్ల గ్రామస్తులు, రైతులు ఏఎమ్మార్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బుధవారం కంపెనీ వర్క్ సూపర్ వైజర్స్ బోబ్బిలి నరేష్ గౌడ్,నవీన్ పనులు పర్యవేక్షించారు.
కొనసాగుతున్న చెరువు కట్ట మరమ్మత్తు పనులు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES