నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని మద్దికుంటలో మంగళవారం రెవిన్యూ సదస్సును తహసిల్దార్ ఉమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. రెవిన్యూ గ్రామానికి చెందిన 27 మంది రైతులు భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నట్లు ఉమలతా తెలిపారు. రైతులు రెవిన్యూ సదస్సును తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వినియోగించుకోవాలని, నేడు రెడ్డిపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ సమస్యలు ఉన్న రైతులు సంబంధిత పత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఉదయం గం 10:00 నుండి సాయంత్రం గం 5:00 వరకు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ రసీదును పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రవి కాంత్, సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్, సిబ్బంది ప్రవీణ్, నర్సింలు, రవి, బాలరాజు, ఇమ్రాన్, ప్రదీప్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రెవెన్యూ సదస్సు ..
- Advertisement -
- Advertisement -



