- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం జనగామ గ్రామంలో గురువారం గ్రామ పాలన అధికారి రవి గతంలో రైతులు సాదా బైనమ, పి ఓ టి లా ద్వారా తమ భూముల విషయమై దరఖాస్తు చేసుకున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ కు అనుకూలమైన వాటిని మండల ఎమ్మార్వో కు రికమండు చేయడం జరుగుతుందని జనగామ ప్రాలన అధికారి రవి తెలిపారు. ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ కు అనుకూలమైన భూములను తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గ్రామ రైతులకు సూచించారు.
- Advertisement -