Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొనసాగుతున్న యూరియా తిప్పలు

కొనసాగుతున్న యూరియా తిప్పలు

- Advertisement -

ఇందుగులలో మహిళా రైతు చేతివేళ్లు విరిగిన వైనం
నవతెలంగాణ-విలేకరులు

యూరియా కోసం రైతుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలకేంద్రంలో పీఏసీఎస్‌ గోదాం వద్ద ఉదయం నుండే రైతులు, మహిళలు క్యూ లైన్‌లో నిలబడ్డారు. క్యూ లైన్‌లో నిలబడ్డ ఇందుగుల గ్రామానికి చెందిన మహిళా రైతు గోదాం కిటికి పట్టుకొని నిలబడి ఉంది. వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా కిటికి డోర్‌ వేయడంతో ఆమె చేతి నాలుగువేళ్లు విరిగాయి. దీనికి బాధ్యులైన అధికారు లపై చర్య తీసుకొని తగిన నష్టపరిహారం ఇప్పించాలని అక్కడ ఉన్న రైతులు డిమాండ్‌ చేశారు. అనంతరం రైతులు రహదారిపై ధర్నా చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. తిప్పర్తి మండలకేంద్రంలో యూరియా కోసం రైతులు ధర్నా చేయగా సీపీఐ(ఎం) నాయకులు మద్దతు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలోని పీఏసీఎస్‌ వద్ద రైతుల నుంచి పట్టా పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్సులు తీసుకొని ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు రోడ్డెక్కి తాండూర్‌- మహ బూబ్‌నగర్‌ ప్రధానరోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు వచ్చి నచ్చ చెప్పినా వినకుండా రోడ్డుపై బైటాయించారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌ మండలం నిల్‌గుర్తి గ్రామంలో యూరియా సమస్యను పరిష్క రించాలని సీపీఐ(ఎం), రైతు సంఘం ఆధ్వర్యంలో ఫ్లెక్సీలతో నిరసన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -