Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న మహిళా క్రీడా పోటీలు..

కొనసాగుతున్న మహిళా క్రీడా పోటీలు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ప్రాంగణంలో రెండో రోజు మహిళా క్రీడా పోటీలు కొనసాగినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి టీజేఏసీ అధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా స్పీడ్ వాక్, టెన్నికాయిట్ సింగిల్, క్యారమ్స్, స్పీడ్ వాక్కు, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జాయింట్ సెక్రెటరీ ఆర్ శైలజ,  మహిళా అధికారులు,  జిల్లా ఎస్ జి ఎఫ్  సెక్రెటరీ దశరథ్ రెడ్డి, గోపాల్, పిడి, పిఈటి కార్యాలయ సిబ్బంది మురళి, జయ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -