Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభారత సైన్యంలో చేరేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం

భారత సైన్యంలో చేరేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
భారత సైన్యంలో వివిధ కేటగిరీల్లో నియామకానికి సంబంధించి అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి ఆన్‌లైన్‌ నమోదు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అగ్నివీర్‌ కేటగిరీల్లో అవివాహిత యువత కోసం నియామక నోటిఫికేషన్‌ 13 ఫిబ్రవరి 2026న www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో విడుదలైంది. సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నివాసితుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌ (10వ తరగతి), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌ (8వ తరగతి).

అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా ఏ రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్‌ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలకు పెంచబడింది. ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష 13 భాషల్లో (తెలుగు సహా) నిర్వహించబడుతుంది.అభ్యర్థులు తాజా సమాచారం కోసం www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించాలి, తమ నమోదు చేసిన ఈ-మెయిల్‌ ఐడీలను చెక్‌ చేయాలి. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ను 040-27740059 నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -