Saturday, May 3, 2025
Homeబీజినెస్రాష్ట్రంలో 800 శాతం పెరిగిన ఆన్‌లైన్‌ జూదం

రాష్ట్రంలో 800 శాతం పెరిగిన ఆన్‌లైన్‌ జూదం

హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన ఐదేండ్లలో భారీగా ఆన్‌లైన్‌ జూదం పెరిగిందని ప్రహార్‌ తెలిపింది. వివిధ ప్రజా అంశాలపై స్పందించే ఎన్‌జీఓ ప్రహార్‌.. తాజాగా ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌లపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై 2500 మంది అభిప్రాయాలను సేకరించినట్టు పేర్కొంది. తెలంగాణలో 2017 నుంచే ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నిషేధించినప్పటికీ.. పలు మార్గాల్లో మొబైల్‌ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ కొనసాగుతూనే ఉందని ప్రహార్‌ అధ్యక్షుడు అభరు రాజ్‌ మిశ్రా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ జూదంతో ముడిపడి ఉన్న సైబర్‌ నేరాలు రాష్ట్రంలో 2020 నుంచి 2025 మధ్య 800 శాతం పైగా పెరిగాయన్నారు. మనీలాండరింగ్‌, యువత ఆత్మహత్యలు, సెలబ్రిటీల ప్రచారంతో నడుస్తోన్న బెట్టింగ్‌ యాప్‌లు సవాళ్లుగా నిలుస్తోన్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img