- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారంలో హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం గుట్టురట్టు చేసింది. రూ.5వేల కోట్ల విలువైన గేమింగ్ సిండికేట్‌పై దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌లో ముంబయికి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయిలో సోదాలు చేపట్టారు. జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



