నవతెలంగాణ – ఆలేరు టౌన
ఆలేరు పట్టణంలోని రైతులకు, యూరియా కొనుగోలు సందర్భంగా ఆన్లైన్ సమస్యలు అధికమయ్యాయి. మొబైల్ ఫోన్ యాప్ ద్వారా రైతులు యూరియా, డిఏపి ఇతర ఎరువులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఎరువులు ఇస్తున్న విధానం ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు వేదికల వద్ద , రైతులకు, వ్యవసాయ అధికారులు ఆన్లైన్ బుకింగ్ ,సంబంధిత అంశాల గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. యురియా బస్తాల కొరకు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన రైతులకు , ఆ యాప్ పై కనీస అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు తెలియజేస్తున్నారు.
యూరియా కొరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే విధాన
మొబైల్ ఫోన్ వాడే రైతులు , ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫెర్టిలైజర్స్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. రైతు యాప్ ఇన్స్టాల్ అనంతరం కుడిసైడు ఇంగ్లీషులో పైన కనబడే పదాలను తెలుగులోకి అనువదించుకోవాలి. అనంతరం రైతు ఆప్షన్ ఎంచుకొని రైతు పట్టా పాస్ పుస్తకం ,నెంబర్ యాడ్ చేయాలి. ఫోన్ నెంబర్ను లింక్ చేయాలి. ధ్రువీకరణ అనంతరం మనకు సంబంధించిన జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఓటిపి ఆప్షన్ లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన ఓటీపీని ధ్రువీకరించి మళ్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇందులో సాగు జోడించండి, యూరియా సంచులు బుక్ చేయండి, బుక్ చరిత్ర అంశాలు వస్తాయి. ఈ పట్టాదార్ పాస్బుక్ నెంబర్లు భూ సర్వే నెంబర్లు వస్తాయి. కం భూమిలో రైతు ఎంత సాగు చేశాడు ఏ పాండ సాగు చేశాడనే అంశాలను ధ్రువీకరించాలి. అనంతరం యూరియా సంచులు బుక్ చేసుకోవాలి. సాగు చేస్తున్న భూమిలో ఏ పంట సాగు చేస్తున్న విధానాన్ని బట్టి ఎంత యూరియా అవసరముంటుందో ఆన్లైన్లో తెలియజేస్తుంది. అవసరం మేరకే బస్తాలను సూచిస్తుంది. ఎకరాకు రెండు చొప్పున, రెండు దశలలో ఒకసారి 2 బస్తాలు మరోసారి 2 బస్తాలు తీసుకునేందుకు వీలుంటుంది.
ఆలేరు పట్టణంలో రైతుల కొరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో, గ్రోమోర్ శ్రీ లక్ష్మీనరసింహ ఎరువుల దుకాణంలో ఈ ఆన్లైన్ యాప్ ద్వారా రైతులు యూరియా కొనుగోలు చేయవచ్చు సంబంధిత వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.



