నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.
రాష్ట్ర స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ 5,6 స్థానాలను సాధించిన యం.డి.శైలాని,బి.సిరి చందనలను, గైడ్ టీచర్స్ వి.కుమారస్వామి, బి.వెంకటేశ్వర్లును ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు, శ్రీనివాస్, జయభాస్కర్, జగన్ నాయక్, శివలింగం, స్వర్ణలత, పూర్ణచందర్, శ్రీధర్, సరస్వతి, రాజేందర్, మహేష్, వినోద్ పాల్గొన్నారు.



