– కాటారం మండల విద్యాధికారి శ్రీదేవి ఆదేశం
నవతెలంగాణ – కాటారం
పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు కాటారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కులం, ఉపకులం (Caste & Sub-Caste) వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని మండల విద్యాధికారి (MEO) శ్రీమతి ఐ. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. School Education Department Telangana మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను ISMS Telangana వెబ్‌సైట్‌లో నిర్దేశించిన గడువులోగా నమోదు చేయాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
విద్యార్థుల సమగ్ర గణాంకాల సేకరణ, సంక్షేమ పథకాల అమలు, రిజర్వేషన్ ప్రక్రియల్లో పారదర్శకత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ధృవపత్రాల ఆధారంగా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గడువు లోపల నమోదు పూర్తి చేయని పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని మండల విద్యాధికారి హెచ్చరించారు. అన్ని పాఠశాలలు దీనిని అత్యవసరంగా పరిగణించి సహకరించాలని కోరారు.



