Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆన్‌లైన్‌లో వాహన రిజిస్ట్రేషన్లు

ఆన్‌లైన్‌లో వాహన రిజిస్ట్రేషన్లు

- Advertisement -

– డీలర్లు ఆలస్యం చేస్తే చర్యలు
– రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం డీలర్‌ పాయింట్‌ ద్వారా దరఖాస్తుల సమర్పణకు బదులుగా ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి ఆదేశాలు జారీచేశారు. గత జనవరి 24 నుంచే రవాణా శాఖలో డీలర్‌ పాయింట్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేయబడిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ మోటార్‌ సైకిళ్లు, మోటార్‌ కార్లు మొదటి రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీఏ కార్యాలయాలకు వాహనాన్ని చూపించే విధానాన్ని తొలగిస్తూ ముందుగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు డీలర్లు ఫారం-20 (ఫైనాన్సియర్‌ సంతకంతో, అవసరమైతే) ఇతర పేపర్‌ ఆధారిత పత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ లేదా కొరియర్‌ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్టు గమనించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు మార్పులు చేస్తూ శుక్రవారం కొత్త విధానాన్ని అమలుచేయనున్నట్టు రవాణా శాఖ నిర్ణయం తీసుకుందని వివరించారు.
ముఖ్యాంశాలు
4 మార్చి 13, 2026 నుంచి డీలర్లు ఆర్టీఏ కార్యాలయా లకు ఫారం-20, ఇతర పత్రాలను భౌతికంగా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.
4 ఇకపై డీలర్లు వాహన యజమాని, ఫైనాన్సియర్‌ (అవసరమైతే) సంతకాలతో కూడిన ఫారం-20, ఇతర పత్రాల స్కాన్‌ కాపీలను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలి
4 మార్చి 13, 2026 తర్వాత జారీ అయ్యే తాత్కాలిక రిజిస్ట్రేషన్ల వాహనాలకు భౌతిక పత్రాలను ఆర్టీఏ కార్యాలయాలు స్వీకరించవు
4 మార్చి 13, 2026 కు ముందు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పొందిన వాహనాలకు కూడా, డీలర్లు ఫారం-20, ఇతర పత్రాల స్కాన్‌ కాపీలు అప్లోడ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్‌ పొందే అవకాశం కల్పించాం
4 డీలర్లు అప్లోడ్‌ చేసే పత్రాలకు పూర్తి బాధ్యత వారిదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పించినట్టయితే చట్టప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం
4 ఆర్టీఏ కార్యాలయాల్లో అందిన ఆన్‌లైన్‌ దరఖాస్తులను రెండు పని దినాల్లోగా పరిశీలించి ఆమోదం లేదా సమీక్ష చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఆలస్యమైతే కఠిన చర్యలు తీసుకుంటాం
4 డీలర్లు తమ వద్ద ఏడు రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే వారి ఆన్‌లైన్‌ లాగిన్‌ నిలిపివేయబడుతుంది. నిబంధ నల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఈ నేపథ్యంలో అన్ని అధీకృత ఆటోమొబైల్‌ డీలర్లు పైమార్పులను గమనించి, వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఫారం-20, ఇతర పత్రాలను కేవలం ఆన్‌లైన్‌ విధానం లోనే సమర్పించాలని రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -