Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాలన చాతకాని వాడే విషం చిమ్ముతాడు

పాలన చాతకాని వాడే విషం చిమ్ముతాడు

- Advertisement -

– రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాలన చాతకాని వాడే ప్రచారంలో విషం చిమ్ముతాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవు, వచ్చేది ఒక్కటే మురికిభాష అని బుధవారం ఎక్స్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్వర్డ్‌లో ఐదు రోజులు కాదు, 500 రోజులు కోర్సులు చేసినా సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరేనని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి, ఉద్యమాన్ని నడిపి, రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్‌పై మురికిమాటలు మాట్లాడే రేవంత్‌రెడ్డి స్థానం మురికి కాలువేనని పేర్కొన్నారు. అది అహంకార లక్షణం కాదనీ, పూర్తి అసమర్థతకు గుర్తు అని తెలిపారు. చరిత్రను సృష్టించిన నాయకుడిని మాటలతో తక్కువ చేయలేరనీ, మురికి భాష మాట్లాడేవాడు మానసిక దరిద్రతనే ప్రజల ముందు బహిర్గతం చేస్తారని పేర్కొన్నారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే అది రాజవబోదనీ, సింహాసనానికే అవమానమని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించిన వారిపై దారిలో పెట్టిన వారిపై నోరు విప్పే నైతిక హక్కు రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ చరిత్రను రేవంత్‌ మాటలు మసకబార్చలేవనీ, ఆ మాటలే తెలంగాణ ప్రజలకు రోజురోజుకీ మరింత స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -