నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక సమస్యలు పరిష్కారించాలన్నా,వాటిని పరిశీలించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్న సీపీఐ ( ఎం) పార్టీ తోనే సాధ్యం అని అందుకే కాంగ్రెస్ బలపరిచిన ఆ పార్టీ అభ్యర్థిని తగరం నిర్మల గెలిపించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఓటర్లు కు పిలుపునిచ్చారు. 21వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థిని తగరం నిర్మల విజయం కాంక్షిస్తూ శనివారం ఆయన సీపీఐ (ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య తో పాటు ఆ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె అయిన, పట్టణం అయినా స్థానికులు ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు వామపక్ష ప్రతినిధులు గెలవడం ఆవస్యకం అన్నారు.కాంగ్రస్ – సీపీఐ (ఎం) ఎన్నికల పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అన్ని వార్డుల్లో విజయం సాధిస్తాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకవల్లి వీరభద్ర రావు, తుమ్మ రాంబాబు,ఆళ్ళ నాగేశ్వరరావు, ఇబ్రహీం,తగరం ముత్తయ్య, కొల్లు వెంకట రమణ, సీపీఐ (ఎం) నాయకులు దొడ్డ లక్ష్మి నారాయణ,మోరంపుడి శ్రీనివాస్ రావు, చిరంజీవి,సోడెం ప్రసాద్, ముల్లగిరి గంగరాజు కలపాల భద్రం, చొక్కా సీతారామయ్య పాల్గొన్నారు.



