రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డ
నవతెలంగాణ – వనపర్తి
యువత పట్టుదలతో కష్టపడేవారికి ఒక్క చదువు మాత్రమే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని, చదువుతోపాటు గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్ష ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి మండలం రాజపేట గ్రామానికి చెందిన లక్ష్మయ్య, ఈశ్వరమ్మ ల కుమారుడు మోహన్ కుమార్ నీట్ పరీక్ష లో 383 మార్కులతో 6000 స్టేట్ ర్యాంక్ తో జయశంకర్ భూపాలపల్లి లో ఎంబిబిఎస్ సీట్ సాధించారని, అందుకు విద్యార్థిని శాలువతో సన్మానించి డా. జి. చిన్నారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మోహన్ కుమార్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివి ఎంబిబిఎస్ సీటు సాధించడo చాల గర్వకారణమన్నారు.
పేద కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి చదివి ఎంబిబిఎస్ లో సీట్ సాధించడం చాలా సంతోషకరమని కొనియాడారు. తను ఒక మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని వనపర్తి నియోజక వర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి జిల్లా ఏఐపిసి ఉపాధ్యక్షులు నాగార్జున, వనపర్తి జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు రోహిత్, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నాయకులుఇర్ఫాన్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి, వాకిటి బాలరాజ్, కోళ్ల వెంకటేష్, జానంపేట నాగరాజు, రామ్ సింగ్ నాయక్, మన్యం యాదవ్, అబ్దుల్లా, నందిమల్ల రాము, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఒక్క చదువు మాత్రమే గౌరవాన్ని ఇస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES