తహశీల్దార్ అబ్దుల్ ఖయ్యూం
నవతెలంగాణ – రాయికల్ : ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామాల్లో 1.5లక్షలు, పట్టణాల్లో 2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని తాహశీల్దార్ అబ్దుల్ ఖయ్యూం కోరారు. పట్టణంలోని తాహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని మీసేవ నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపు దారులు, సొంత కారు ఉన్నవారు, 3.5 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు రేషన్ కార్డు పొందడానికి అనర్హులని, అటువంటి వారు దరఖాస్తులు చేసుకోవద్దని సూచించారు. మీసేవ నిర్వాహకులు ఆహార భద్రత దరఖాస్తు తో పాటుగా దరఖాస్తుదారుని ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భూ ధ్రువీకరణ పత్రాలు జత చేసి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తాహశీల్దార్ గణేష్, ఆర్.ఐ లు పద్మయ్య, దేవదాస్, కంప్యూటర్ ఆపరేటర్ రాజేందర్ మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు.
అర్హులు మాత్రమే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES