సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి
విజయవంతమైన సుగుణ 22వ వర్ధంతి సభ
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
దీర్ఘకాలిక ఉద్యమాలే చరిత్రలో నిలిచిపోయాయని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని రామిరెడ్డి నివాసం లో స్వేచ్ఛా అధ్యక్షతన సుగుణ వర్ధంతి సభ నిర్వహించారు. “ప్రజా ఉద్యమాలు ప్రస్తుత పరిస్థితి రాజ్యం పాత్ర” అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడారు.. ఏ ఉద్యమాలైన తాత్కాలికంగానే వెనకడుగు వేశాయని, దీర్ఘ కాలిక పోరాటం చేసే ఉద్యమాలు ఇప్పుడు వస్తున్న సంక్షోభాలను దాటుకుని వెళ్లిన చరిత్ర ఉన్నదని, ఉద్యమాలు ఎప్పటికీ ఆగిపోవని, ప్రజల కష్టాలు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయన్నారు.
అడ్వకేట్ మధు మాట్లాడుతూ సుగుణక్క విద్యార్థి ఉద్యమంలో ముందు ఉంటూ , నల్లమల్ల ఉద్యమాన్ని నడిపే స్తాయికి ఎదిగిందన్నారు. వెంకటకృష్ణ మాట్లాడుతూ తనతో పాటు చదువుతున్న క్రమంలో సుగుణ నిర్ణయించుకొని ప్రజల కొరకు పని చేయడానికి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లిందని, ఆమెకి ఎంతో ఉన్నత విలువలు ఉన్నాయని కొనియాడారు.సి ఎం ఎస్ రాష్ట్ర కోశాధికారి జ్యోతి మాట్లాడుతూ మనువాద సంస్కృతిని వ్యతిరేకిస్తూ మానవ విలువలు నెలకొల్పే సంస్కృతికి దారులు వేయాలనారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రభాకర్ మాట్లాడుతూ సుగుణ కుటుంబంతో రామిరెడ్డి తో తనకున్నా అనుబంధాన్ని పంచుకున్నారు. పౌర హక్కుల సంఘం సుభాన్, విజయభాస్కర్, తెలంగాణ రైతాంగ సమితి నుండి గోపాల్, అఖిలపక్ష కమిటీ నుంచి వెంకట్రాములు, తదితరులు మాట్లాడారు. బార్ కౌన్సిల్ నెంబర్ కొండారెడ్డి, చెల్లెలు విజయ, అమ్మ వేదమ్మ బంధువులు పాల్గొన్నారు.. గౌస్, శోభ పాటలు పాడి సబికులను ఉత్తేజ పరిచారు.



