Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి వచ్చేది నాలుగు శాఖల అధికారులే

ప్రజావాణికి వచ్చేది నాలుగు శాఖల అధికారులే

- Advertisement -

మిగతా శాఖల అధికారుల గైరాజరిపై చర్యలు కరువు
నవతెలంగాణ – మద్నూర్

ప్రతి సోమవారం మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే అధికారుల ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరు అవుతున్నారు. మిగతా శాఖల అధికారులు గైరాజార్ గా ఉన్నప్పటికీ అలాంటి శాఖల అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భయం లేకుండా ప్రజావాణికి రావట్లేదని ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేయడానికి ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో తాహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పూలేదు. 28న సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తాహశీల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎంపీఓ వెంకట నరసయ్య, ఏపీఎం రవీందర్, ఏపీవో పద్మ వైద్యశాఖ అధికారిని తప్ప మిగతా శాఖలన్నీ గైరాజర్ గానే కనిపించాయి. ప్రజావాణి కి రావలసిన శాఖల అధికారులు గైర్హాజర్ ఉంటే అలాంటి శాఖల అధికారులపై ఎలాంటి మెమో గాని, చర్యలు గాని ప్రజా ప్రభుత్వంలో కనిపించడం లేదని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు గైరాజరిగా ఉండకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -