ఎస్సికాలని పాఠశాలలో నిర్వహకం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 50 మంది ఉన్నారు.వీరికి విద్యను బోధించడానికి ప్రభుత్వ ప్రాధానోపాధ్యాయురాలు, ఒక ఉపాధ్యాయుడుతోపాటు, ఓసిపి సిఎస్ఆర్ నిధులతో ఒక తాత్కాలిక విద్యావాలింటర్ ఉన్నారు. అయితే ఇక్కడ మధ్యాహ్న భోజనం చేసే స్వశక్తి మహిళ సంఘం వంట కార్మికులు ఇద్దరికి బదులుగా ఒక్కరే విధులు నిర్వహిస్తూ ఇద్దరి వేతనం ఒక్కరే పొందుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే పాఠశాలలో (స్కావెంజర్) తాత్కాలిక స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సమయపాలన పాటించడంవలేదని, అతను ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు గీతను నవ తెలంగాణ వివరణ కోరగా వంట కార్మికురాలు ఒక్కరూ విధులు నిర్వహిస్తుంది నిజమే. కానీ వేతనాలు ఇద్దరు కార్మికుల ఖాతాల్లో ఎవరివి వారికే జమవుతున్నట్లుగా తెలిపారు. స్కావెంజర్ ప్రతిరోజూ పాఠశాలను పరిశుభ్రం చేస్తున్నట్లుగా, సమయపాలన పాటించేలా చూస్తామన్నారు.విదులు నిర్వహించడానికి ఎవరైనా ముందుకొస్తే తీసుకుంటాం.
అమ్మ ఆదర్శ కమిటీ సూచించిన మేరకే: లక్ష్మన్ బాబు.. ఎంఈఓ
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మఆదర్శ కమిటీ సూచన మేరకె స్కావెంజర్ ను నియమించచడం జరుగుతుంది. మిడ్డేమిల్స్ ఘటనపై పిర్యాదు అందితే చర్యలు తీసుకుంటాం.



