Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తెలంగాణ మేస్త్రీలకే అవకాశం కల్పించాలి 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తెలంగాణ మేస్త్రీలకే అవకాశం కల్పించాలి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తెలంగాణ మేస్త్రీలకే అవకాశం కల్పించాలని బొమ్మెర గ్రామమే మేస్త్రీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని బమ్మెరలో తెలంగాణ మేస్త్రీలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంగాల ఎల్లయ్య, బొంకూరి యాకయ్యలు మాట్లాడుతూ గ్రామం మేస్త్రీలు ఇళ్లను నిర్మాణం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం బమ్మెర గ్రామానికి ఇందిర మైండ్లను మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ఆంధ్ర మేస్త్రీలకు అప్పగిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులను నమ్మించి తక్కువ ధరలకు ఇండ్ల నిర్మాణాలు చేస్తామని మోసం చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర మేస్త్రీల వల్ల తెలంగాణ మేస్త్రీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆంధ్ర మేస్త్రీలు బమ్మెర గ్రామంలో ఎలాంటి పనులు చేయరాదని, గ్రామానికి రాకూడదని బమ్మెర మేస్త్రీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

బమ్మెర మేస్త్రీల సంఘం ఎన్నిక 

బమ్మెర మేస్త్రీల సంఘం గౌరవాధ్యక్షులుగా వంగాల ఎల్లయ్య, బొంకురి యాకయ్య, వంగాల గణేష్, అధ్యక్షులుగా బంగాళా అశోక్, ఉపాధ్యక్షులుగా కొడిశాల యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా బరిగల యాకయ్య, సహాయ కార్యదర్శిగా మారేపల్లి యాకయ్య, కార్యవర్గ సభ్యులుగా ఏనుగుతల అంజయ్య, వంగాల అంజయ్య, గాదరి అశోక్, బంగాళా రవి, బొంకూరి రవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad