Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఇమ్మడి గోపికే సాధ్యం..

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఇమ్మడి గోపికే సాధ్యం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
కులం మతం భేదం లేకుండా మండలంలోని ఈ గ్రామంలోనైనా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఇమ్మడి గోపికే సాధ్యమని పలువురు పేర్కొన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన దోమకొండ లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొన్న దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్  లింగాపూర్ నుండి గన్నారం వచ్చి అంతక్రియల కోసం తన వంతు సాయంగా పదివేల రూపాయల ఆర్థికంగా సహాయం చేశారు.

ఆయన చేసిన సహాయానికి పలువురు అభినందనలు తెలిపారు ఆపదలో ఉన్న కుటుంబానికి ఆదుకోవడంలో ఉమ్మడి గోపి ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నారం గ్రామ కాంగ్రెస్ నాయకులు బద్దం రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గాండ్ల భైరయ్య, నాయని సాయిలు, గుండ్ల నవీన్, బుట్టి ప్రశాంత్, రుద్ర బోయిన మహేష్, గొల్ల రాకేష్ తోపాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -