నూతన బ్యాంకు ఖాతా తెరవాలి
నవతెలంగాణ – మిర్యాలగూడ
గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే వారి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలని, సంబంధిత ఓటర్ లిస్టులో ఓటరుగా నమోదయి ఉండాలని సహాయ ఎన్నికల అధికారి ఎంపీడీవో శేషగిరి శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ నామినేషన్ తో పాటు జతపరచాలని, ఓటర్ గుర్తింపు కార్డు (పోటీ చేసే అభ్యర్థి) జిరాక్స్ కాపీ, ప్రతిపాదించే అభ్యర్థి జిరాక్స్ కాపీ, నూతన బ్యాంకు ఖాతాను తెరిచి జిరాక్స్, ఇంటి పన్ను రసీదు జిరాక్స్ కాపీ, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు (4) నాలుగు, నామినేషన్ కి పత్రాలు జతపరచాలని సహాయ ఎన్నికల అధికారి తెలిపారు.
నామినేషన్ డిపాజిట్ వివరాలు జనరల్ అభ్యర్థులకు సర్పంచ్ రూ 2,000 వేలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000 వెయ్యి, వార్డు మెంబర్ జనరల్ అభ్యర్థులకు రూ 1,000 వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు రూ 500 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి సర్పంచ్ కు 1 లక్ష 50 వేల రూపాయలు, వార్డు మెంబర్ కు రూ.30,000 వేల పరిమితి నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు.



