వియన్నా : చమురు ఉత్పత్తి కోటానే మరోసారి పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) అంగీకరించింది. మేనెల కోసం చమురు ఉత్పత్తి కోటాను రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర పెంచేందుకు అనుమతించింది. మే కోటాను పెంచేందుకు అంగీకరిస్తూ సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యుఎఇ, కువైట్, కజికి స్తాన్, అల్జేరియా, ఒమన్ వంటి ఎనిమిది దేశాలతో కూడిన ఒపెక్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ”ఈ దేశాలు మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించడం, అంచనా వేయడం కొనసాగిస్తాయి.
అలాగే మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇచ్చే తమ నిరంతర ప్రయత్నాలను చేపడతాయి” అని వెల్లడించింది. చమురు కేంద్రాల దాడులపై ఒపెక్ ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్లో ధ్వంసమైన చమురు కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో పునరుద్ధరించడం ఖర్చుతో కూడుకున్నదని, దీర్థకాలం పడుతుందని, ఇది పంపిణీపై తీవ్రం ప్రభావం చూపుతోందని తెలిపింది. అయితే హార్ముజ్ జలసంధి నుండి రవాణా అయ్యే చమురుతో పోలిస్తే ఈ కోటా పెంపు కేవలం రెండు శాతమే ఉండనుందని ఒపెక్ తెలిపింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుని, నాలుగేళ్ల గరిష్టానికి ఎగబాకాయి. దీంతో రవాణా ఇంధనాల ధరలు పెరిగాయి.
చమురు ఉత్పత్తి కోటా పెంచేందుకు ఒపెక్ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



