నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని సర్కిల్ పోలిస్ స్టేషన్ లో శుక్రవారం ఓపెన్ హౌజ్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. సిఐ మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సిస్ లు పోలిస్ స్టేషన్ వ్వవస్థ,నిర్వహణ గురించి విద్యార్థులకు తెలియజేశారు. పోలిస్ స్టేషన్లో ఉన్న లాకప్ గది, వైర్లెస్ సేట్ వాడకం, కేసుల నమోదు, రిసెప్షన్ కౌంటర్, తుపాకుల వాడకం గురించి క్లూప్తంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారన్నారు. పోలీసులు విధి నిర్వహణలో 24 గంటలు ప్రజల భద్రతకే పెద్ద పీటవేస్తారని వారు పేర్కొన్నారు. మీ పరిసరాల్లో ఏదైనా సంఘటన జరిగితే పోలీసులకు తెలియజేయాల్సిన బాధ్యత గురించి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి తెలియజేయాలన్నారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అన్నారు. పాఠశాలలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా విద్యార్థులు పోలీసులను సంప్రదించవచ్చని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ముధోల్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌజ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



