Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం24న గార్లలో పంచాయతీ కార్మికుల బహిరంగ సభ

24న గార్లలో పంచాయతీ కార్మికుల బహిరంగ సభ

- Advertisement -

– 24, 25 తేదీల్లో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ రాష్ట్ర ఐదో మహాసభలు
– గోడపత్రిక ఆవిష్కరణలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ఐదో మహాసభలు ఈ నెల 24,25 తేదీల్లో మహబూబాబాద్‌ జిల్లా గార్లలో జరుగనున్నాయనీ, 24న పంచాయతీ కార్మికులతో బహిరంగ సభ ఉంటుందని ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, వీఎస్‌. రావు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పైళ్ల గణపతిరెడ్డి, మహిళా కన్వీనర్‌ పొట్ట యాదమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ మహాసభల సందర్భంగా 24న గార్లలో ఉదయం 11 గంటలకు భారీ ప్రదర్శన- బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.

బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల పర్మినెంట్‌, పంచాయతీ సిబ్బందిని రెండో పీఆర్‌సీ పరిధిలోకి తీసుకొని కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడం, మల్టీపర్ఫస్‌ వర్కర్‌ విధానం రద్దు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఇన్సూరెన్స్‌ అమలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయబోతున్నామని తెలి పారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పైళ్ళ గణపతిరెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ పొట్ట యాదమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొ స్తున్నా పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ప్రతినెల గ్రీన్‌ ఛానల్‌ ద్వారా కార్మికుల ఖాతాల్లో ఐదో తేదీలోగా వేతనాలు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో ఎక్కని కార్మికులను నమోదు చేయాలని కోరారు. కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -