నవతెలంగాణ – కంఠేశ్వర్
వేసవి కాలం వేడిగా ఉండటంతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్తించబడిన ప్రాంతాలలో చలివేంద్రం కేంద్రం జోన్ 4, 5 తో పాటు అవసరం ఉన్నచోట ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పలు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను కమిషనర్ పరిశీలించారు. చలివేంద్రాల చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఎండాకాలం దృశ్య మంచినీటిని త్రాగేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జోన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -