Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ సింధూర్‌ ముగియలే..చిన్న బ్రేకే

ఆపరేషన్‌ సింధూర్‌ ముగియలే..చిన్న బ్రేకే

- Advertisement -

ప్రతిసారీ పాక్‌ను తిప్పికొడుతున్నాం
నిజాంను లొంగదీసిన ఘనత పటేల్‌దే : కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా ముగియ లేదనీ, చిన్న బ్రేక్‌ మాత్రమే ఇచ్చామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజర య్యారు. తొలుత సైనిక అమరవీరుల స్థూపం, పటేల్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్‌ సభలో సాయుధబలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా నిర్వహించిన కళాకారుల ప్రదర్శనలను తిల కించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఫహల్గాంలో పాక్‌ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడ్డార న్నారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌ ఉగ్రమూకలను, స్థావరాలను అంతమొం దించి మన దేశ సత్తా ఏంటో ప్రపంచానికి చూపామని గర్వంగా చెప్పారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంపై మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని ప్రధాని మోడీ తేల్చిచెప్పారని గుర్తుచేశారు. సరిహద్దుల్లో పాక్‌.. కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్న ప్రతీసారి భారత్‌ సమర్థంగా తిప్పికొడుతున్న మన బలగాల పనితీరును కొనియాడారు. ఉక్కు మనిషి వల్లభారు పటేల్‌ హైదరాబాద్‌కు విముక్తి కల్పించి భారత్‌లో ఏకం చేశారని తెలిపారు. రాజకీయ పరి పక్వతతో ఆనాటి సంస్థానాలను భారత్‌లో విలీనం చేయ డంలో పటేల్‌ కృషిని కొనియాడారు. రజాకార్ల అరాచకాలను భరించిన నేల ఇదనీ, వల్లభారు పటేల్‌ రజాకార్ల పీచమణిచి నిజాంను లొంగదీసుకున్నారని గుర్తుచేశారు.

సభ అనంతరం కంటోన్మెంట్‌లో దివంగత మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌ పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తెలంగాణ వైభవాన్ని రక్షించిన విమోచన దినోత్సవాన్ని జరపాలని ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..నిజాం రాజ్యంలోని కొన్ని జిల్లాలు కర్నాటక, మహారాష్ట్రలో కలిపారనీ, అక్కడ ప్రతి ఏటా ముక్తిదివస్‌ జరుపుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు జరపట్లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్నాటకలో కూడా కాంగ్రెస్‌ సర్కారే ఉందని గుర్తుచేశారు. నిజాం రాజు హైదరాబాద్‌ సంస్థానాన్ని పాక్‌లో విలీనం చేస్తామని లేఖలు రాస్తే పటేల్‌ సైన్యం ఆపరేషన్‌ పోలో ద్వారా మన దేశంలో కలిపారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమార్‌ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌ రావు, ఎంపీ ఈటల రాజేందర్‌, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌, సీఆర్పీఎఫ్‌ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌, హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -