Thursday, May 8, 2025
Homeసినిమావీరత్వాన్ని నింపిన ఆపరేషన్‌ సిందూర్‌

వీరత్వాన్ని నింపిన ఆపరేషన్‌ సిందూర్‌

- Advertisement -

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన ఊహించని దాడికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్‌ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలుకుతోంది. ‘భారత్‌ మాతా కీ జై’, ‘మేమంతా మీ వెంటే’.. అంటూ నెటిజన్‌లు పోస్ట్‌లు పెట్టారు. సినీ పరిశ్రమ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.
మేం సిందూరాన్ని సంప్రదాయ తిలకంగా మాత్రమే కాదు. మా అచంచలమైన సంకల్పానికి చిహ్నంగా కూడా ఉపయోగిస్తాం. మాకు ఎన్ని సవాళ్ళు ఎదురైనా నిర్భయంగా, గతం కంటే బలంగా వస్తాం. భారత సైన్యం, వైమానిక దళం, బీఎస్‌ఎఫ్‌లోని ప్రతీ ధైర్యవంతుడికి వందనాలు. మీ అందరి ధైర్యం మా గర్వాన్ని మరింత పెంచుతుంది. మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది. జై హింద్‌.
– మోహన్‌లాల్‌
దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనం తో చేతులు కట్టేసిన సమస్త భారతంకి ‘ఆపరేషన్‌ సింధూర్‌’తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధానికి కతజ్ఞతలు. – పవన్‌ కళ్యాణ్‌
తగిన న్యాయం జరిగింది. మేరా భారత్‌ మహాన్‌. సైనికులకు సెల్యూట్‌. – మహేష్‌బాబు
మన ఆర్మీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. – ఎన్టీఆర్‌
చిరంజీవి, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, నాని, కళ్యాణ్‌ రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌, విజరు దేవరకొండ, విశ్వక్‌ సేన్‌, బ్రహ్మాజీ, సంయుక్త, మంచు మనోజ్‌ తదితరులు భారత ప్రభుత్వ చర్యలను సమర్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -