నవతెలంగాణ-హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన తుదిపోరులో 5వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. 20ఓవర్లకు గాను 19 ఓవర్లకే 146 పరుగులు చేసి పాకిస్థాన్ టీం ఆలౌటైంది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా..మూడు బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఈ విజయంపై భారత్ జట్టు కెప్టెన్ స్పందించారు. ఫైనల్ పోరులో జట్టు విజయం పొందడం చాలా ఆనందంగా ఉందని జాతీయ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా మూడు సార్లు పాక్ టీంను ఓడించామని, ఆతర్వాత సగర్వంగా టైటిల్ కైవసం చేసుకున్నామని సూర్యకుమార్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా “ఆపరేషన్ సిందూర్ ఆటలో కనపడింది, ఫలితం ఒకటే – భారతదేశం గెలిచింది! మన క్రికెటర్లకు అభినందన్నారు. దేశమంతా తమ వెనుక నిలబడి కొండంతా అండగా నిలిచారని, దీంతో తాము ఫైనల్‌లో స్వేచ్ఛగా ఆడామని, మరోసారి దేశవ్యాప్తంగా మరోసారి సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు.