Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆపరేషన్‌ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌

ఆపరేషన్‌ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లోక్‌సభ లో ‘సిందూర్‌’పై చర్చ మొద‌లైంది. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది. సుదీర్ఘ చర్చ అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వనున్నారు.

మరోవైపు ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. దీంతో లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad