Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడ్జెట్లో వికలాంగులకు నిధులు పెంచాలి

బడ్జెట్లో వికలాంగులకు నిధులు పెంచాలి

- Advertisement -

ఎన్.పి.ఆర్.డి 16వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణలో వక్తలు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం,స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటలు ఉదృతం చేస్తామని,ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసంఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం  సంఘం  కార్యాలయం వద్ద ఎన్ పి ఆర్ డి 16వ ఆవిర్భావ దినోత్సవంసందర్బంగా జెండా ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ చేశారు. ఈ సందర్బంగా ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర అధ్యక్ష లు కె వెంకట్  మాట్లాడుతూ జాలి, దయ, కరుణ మాకొద్దు, మా హక్కులు మాకు కావాలి అంటూ దేశ వ్యాప్తంగా వికలాంగులను ఐక్యం చేయడానికి 2010ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఎన్ పి ఆర్ డి  కలకత్తా పట్టణంలో ఏర్పడిందని,ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం వికలాంగులను సమీకరించి పోరాటాలు చేస్తుందని అన్నారు.

పార్లమెంట్ వేదికగా వికలాంగుల సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేసిందని అన్నారు. 2016 ఆర్ పి డి  చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డ్స్,రైల్వేలో సౌకర్యాలు, సామూహిక ప్రాంతాలు అవరోధ రహితంగా మార్చడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ విలీననికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయాలు సాధించిందని అన్నారు.మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం సమరశిల పోరాటాలు చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతున్నాయని అన్నారు.

పెన్షన్ 6000 లకు పెంచడం తో పాటు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు.బడ్జెట్లో నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయని 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రయివేట్ పరిశ్రమలలో వికలాంగులకు 5శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఫిబ్రవరి 21నుండి 28వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

వికలాంగులను ఐక్యం చేసి పోరాటాలు నిర్మించడంలో సంఘం అగ్రబాగానే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి   జిల్లా అధ్యక్షలు సురుపంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత నాయకులు కేతావత్ మురళి, శ్రీనివాస్ రెడ్డి నాగు నరసింహ పున్న శ్రీధర్ కర్ర కిషన్ లు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -