పెన్షనర్లకు టాప్రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి పిలుపు
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఒక ప్రధాన విధాన మార్పులో కేంద్ర ప్రభుత్వం ఆర్థికచట్టం 2025ను ఆమోదించిందని, దీనిని వ్యతిరేకించాలని టాప్రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు టాప్రా సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగదీష్ చంద్ర, శ్యాంసుందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ఉద్యోగ విరమణ తర్వాత ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని లోక్‌మత్ నివేదిక తెలిపిందని వారు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం, పెన్షనర్లు ఇకపై కరువు భత్యం (డీఏ) పెంపుదల లేదా రాబోయే 8వ వేతన కమిషన్ నుంచి వచ్చే వాటితో సహా డిఏ పెంపు , భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారన్నారు. పెన్షనర్లు ఈ నిబంధనలను చట్టబద్ధంగా సవాలు చేయలేరని వివరించారు.
ఆర్థిక చట్టం 2025ను వ్యతిరేకించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



