Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకించండి

కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకించండి

- Advertisement -

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి కామ్రేడ్ నీలం సాయిబాబా డిమాండ్.
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం ఇవ్వవలసిన 11 రకాల సంక్షేమ పథకాల అమలు నుండి ప్రభుత్వం వైదొలగాలని కుట్ర చేస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అన్నారు. తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐ ఎఫ్ టి యు అనుబంధ) నిజమాబాద్ నగర మొదటి మహాసభ ఈరోజు కోటగల్లి లోని నీలం రామచంద్రయ్య భవన్ లో అధ్యక్షులు కామ్రేడ్ మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి కామ్రేడ్ నీలం సాయిబాబా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, కార్మిక బోర్డుల ద్వారా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల అమలు నుండి వెనక్కి వెళ్లాలని చూస్తున్నాయని ఆరోపించారు.

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని ఫలితంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేక సవరణలకు గురై బలహీనమైందని అన్నారు. ముఖ్యంగా గతంలో పది లక్షల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం ఉన్నప్పుడు 1.5 శాతం సెస్ వసూలు చేసేవారని దానిని ప్రస్తుతం 50 లక్షలకు పెంచడం మూలంగా కార్మిక బోర్డు ఆదాయం కోల్పోయిందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు కార్మికుల పనిగంటలను పెంచాలని కుట్రలు పన్నుతున్నారని తెలియజేశారు. ఒకవైపు కార్మికుల పొట్టను కొడుతూ బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తూ మరియు బకాయిలను రద్దు చేస్తూ అండగా ఉంటున్నారని విమర్శించారు. అనేక సమరశీల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా ప్రభుత్వాలు కాల రాయాలని చూస్తున్నాయని వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక రంగంపై ఉందని గుర్తు చేశారు. ఐక్య కార్మిక ఉద్యమాల ద్వారా హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

 మహాసభకు వక్తగా విచ్చేసిన భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ దేవరాజు మల్లికార్జున్ మాట్లాడుతూ.. సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కింద ఉన్న 14 రకాల నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రభుత్వం నేరుగా అమలు చేయాలని ప్రవేట్ కంపెనీలకు అప్పచెప్పవద్దని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాల వయసు పైబడిన నిర్మాణ కార్మికులను లేబర్ కార్డు నుండి రిటైర్ చేస్తున్నారని వారికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని చెప్పారు. వీరందరికీ ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రతినెల 6 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వైద్య పరీక్షల నిమిత్తం CSC కి ప్రతినెల ఒక్కొక్క కార్మికుడికి 3000 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారని ఆ సంస్థ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా కార్మికులు నష్టపోతున్నారని అన్నారు.

వెంటనే సంస్థను రద్దుచేసి ప్రభుత్వ రంగ సంస్థలకు ఆప్పచెప్పాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రస్తుతం 6,30,000 చెల్లిస్తున్నారని దీనిని 10 లక్షలకు పెంచి ప్రభుత్వమే సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికులు పనిచేసే పని ప్రదేశాలలో తాత్కాలిక పర్మినెంట్ షెల్టర్ వాటికి విద్యుత్ సౌకర్యం, స్నానపు గదులు, టాయిలెట్స్ ఇతరత్రా వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమ అధికారులు ఎప్పటికప్పుడు పైన సౌకర్యాల గురించి తనిఖీలు నిర్వహించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడుకోవడం కోసం కార్మికులందరూ ఐక్య ఉద్యమాలకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు నగర అధ్యక్షులు మోహన్ అధ్యక్షత వహించగా నాయకులు నర్సింగరావు, తాంపే రాజు, లింగం, మల్లేష్, అరుణ్, డానియల్, తప్పెట్ల రాజు, డి.రమేష్ , భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -