Sunday, June 8, 2025
E-PAPER
Homeసినిమాతొలిసారి అల్లు అర్జున్‌ సరసన..

తొలిసారి అల్లు అర్జున్‌ సరసన..

- Advertisement -

అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ అట్లీ, సన్‌ పిక్చర్స్‌ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్‌ నుంచే సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. దీన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లేలా బాలీవుడ్‌ గ్లామరస్‌ క్వీన్‌ దీపికా పదుకొనె కూడా ఈ టీమ్‌తో జాయిన్‌ కావటం విశేషం. పాన్‌ వరల్డ్‌ లెవల్లో బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ విజువల్‌ వండర్‌ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అద్భుతమైన తారాగణంతో ప్రభంజనం సష్టించబోతోందని చిత్ర యూనిట్‌ తెలిపింది.
అల్లుఅర్జున్‌, దీపికాపదుకొనె ..ఈ భారీ కాంబోను తెలియజేసేలా విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. డైరెక్టర్‌ అట్లీతో దీపికా పదుకొనె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన
ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది. హెడ్‌గేర్‌ను ధరించి ఆమె ఫుల్‌ కాస్ట్యూమ్స్‌తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. మరోసారి క్వీన్‌ విజయం సాధించనుందనేది దీంతో స్పష్టమవుతోంది. ఈ చిత్రం కోసం భారతీయ సినీ ఇండిస్టీని శాసించే నాలుగు శక్తులు ఒక చోటకు చేరుతున్నాయి. వారెవరో కాదు.. ఒకరేమో పుష్ప చిత్రంతో నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న అల్లు అర్జున్‌, జవాన్‌, తెరి, బిగిల్‌, మెర్సల్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన సన్సేషనల్‌ డైరెక్టర్‌ అట్లీ, ఇండియన్‌ మీడియాలో ఎంతో శక్తివంతమైన సన్‌ నెట్‌ వర్క్‌తో పాటు ఇప్పుడు ఇండియన్‌ సినిమాల్లో పవర్‌ఫుల్‌, వెర్సటైల్‌ స్టార్స్‌లో ఒకరైన దీపికా పదుకొనె కథానాయికగా జాయిన్‌ కావటం అనేది సినిమా స్కేల్‌, ప్రతిష్ట మరో ఎత్తుకు చేరుకుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. హదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్‌ సన్నివేశాలు, గ్రాండ్‌ విజువల్స్‌, మన సంస్కతికి అద్ధం పట్టే కథ, గ్లోబల్‌ లుక్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది. ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ ”జవాన’్‌ సినిమాలో దీపికతో కలిసి పని చేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్‌ గొప్పగా ఉంటాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉండి ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో పాటు దీపికా పదుకొనె కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడిగా నా కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇందులో సష్టించబోతున్నాం’ అని అన్నారు.
సన్‌ పిక్చర్స్‌ స్పందిస్తూ, ”దీపికా పదుకొనె మా ప్రాజెక్ట్‌లో జాయిన్‌ కావటం అనేది ప్రాజెక్ట్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆమె స్టార్‌ పవర్‌, భరోసా, ఎవరూ సాటిరాని విధంగా ఉండే ఆమె స్క్రీన్‌ ప్రెజన్స్‌ ఈ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్‌ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్‌, దీపిక బ్రిలియంట్‌ పెర్ఫామెన్స్‌లతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌ సినిమాను రూపొందించబోతున్నాం’ అని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -