నవతెలంగాణ- శాయంపేట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రజాబలం ముందు పటపంచాలయ్యాయని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఓటర్ లకు ధన్యవాదాలు తెలుపుతూ.. స్థానిక సంస్థ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బూస్ట్ ని ఇచ్చారని అన్నారు. విజ్ఞులైన ప్రజలు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి నిమ్మల రమేష్ శానం కుమారస్వామి వెంకట రాజిరెడ్డి వరదరాజు రాజేందర్ రవిపాల్ చిరంజీవి జగన్ మార్కండేయ బాసని రవి కొమ్ముల విష్ణు సుధాకర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాబలం ముందు ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



