నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్ష ఎంపీలు బుధవారం ఎఫ్‌సీఆర్‌ఎ (విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ) బిల్లు 2026ను వ్యతిరేకిస్తూ పార్లమెంటు మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌జీవోలను, సంస్థలను టార్గెట్ చేయడం ఆపండి అని రాసిన బ్యానర్‌ను పట్టుకుని నిరసన తెలిపారు. దీన్ని క్రూరమైన చట్టంగా కాంగ్రెస్ ఎంపి హిబి ఈడెన్ అభివర్ణించారు. ఈయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ఒక కఠినమైన చట్టం. ఇది మైనారిటీల ప్రయోజనాలకే కాకుండా భారతదేశంలో నడుస్తున్న అనేక ఎన్‌జివోల ప్రయోజనాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. మేము ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తాము. వ్యతిరేకిస్తాము. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము’ అని ఆయన అన్నారు.
ఎఫ్‌సీఆర్‌ఎను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



