Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజావాణిపై విపక్షం దుష్ప్రచారం

ప్రజావాణిపై విపక్షం దుష్ప్రచారం

- Advertisement -

– 74శాతం ఫిర్యాదులు పరిష్కారం
– ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం
– రెండేండ్లు పూర్తి చేసుకున్న ప్రజావాణి: డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిపై విపక్షం తప్పుడు ప్రచారం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అది తప్పని తేలిందని ఆయన అన్నారు. ప్రజావాణిలో లక్షకు పైగా పిర్యాదులు వస్తే..వాటిలో 74శాతం పిర్యాదులను పరిష్కరించామని ఆయన తెలిపారు. ప్రజావాణి ప్రారంభమై రెండేండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి అధికారి దివ్యదేవరాజన్‌ అధ్యక్షతన జరిగిన కార్యాక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాసమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డికి దివ్యాదేవరాజన్‌కు భట్టి అభినందనలు తెలిపారు.

ఉన్నతాధికారులకు సన్మానం
సీఎం ప్రజా వాణి కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ వి.పి.గౌతంను సత్కరించటంతో పాటు హౌసింగ్‌ కార్పొరేషన్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ బలరాం, వర్క్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఎస్‌. సత్తిరెడ్డి తదితరులను కూడా ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఫిర్యాదుల పై చర్యలు తీసుకోవటంలో చొరవ చూపటంతో పాటు, ప్రజా సమస్యలను పరిష్కరించి మేలు చేసిన విభాగాల్లో హౌసింగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత రెండేండ్ల కాలంలో ప్రజా వాణి ద్వారా 19,456 పిటిషన్లు, ఫిర్యాదులు, సమస్యలు రాగా వాటిలో 19,265 పిటిషన్లపై చర్యలు తీసుకున్నారు. ఇంకా 162 ఫిర్యాదులు మాత్రమే వివిధ దశల్లో పెండింగ్‌ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ద్వారా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 1,750 మంది డబుల్‌ బెడ్‌ రూం లబ్ధిదారుల సమస్య పరిష్కారమై, ఇండ్లు కేటాయించటం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -