Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి 

ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి 

- Advertisement -

సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి 
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పాలకుర్తి యూనిట్ అధ్యక్షులు మహేష్ యాదవ్ 
నవతెలంగాణ – పాలకుర్తి

ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగస్తులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పాలకుర్తి యూనిట్ అధ్యక్షులు బక్క మహేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు కాజా షరీఫ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి పిండేలా శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి లో  పాలకుర్తి యూనిట్ కార్యదర్శి కాసర్ల రాజు, కోశాధికారి రమేష్ బాబు, ఆయా కార్యాలయాల ఉద్యోగస్తులతో  కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓ పి ఎస్ విధానాన్ని పునర్ పునర్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం మూడు గంటలకు హైదరాబాదులో గల ఆర్టీసీ కళాభవన్ లో పాత పెన్షన్ సాధన సభ ఉంటుందని తెలిపారు. జనగామలో నిరసన కార్యక్రమం తో పాటు హైదరాబాద్ లో జరిగే సాధన సభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిపిఎస్ ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగస్తులు అదరూ ఐక్యమత్యంతో పోరాడి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యదర్శులు ఫోరం అధ్యక్షులు వెంకటేశ్వరచారి,పాలకుర్తి ఆర్ ఐ రాకేష్,యుగంధర్,సతీష్,నవీన్, శ్రీధర్,అనురాధ,ప్రియాంక, ప్రశాంత్ లతోపాటు వివిధ శాఖల సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad