Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండీఎస్సీ-2003 టీచర్లకు ఓపీఎస్‌ వర్తింపజేయాలి

డీఎస్సీ-2003 టీచర్లకు ఓపీఎస్‌ వర్తింపజేయాలి

- Advertisement -

మండలిలో శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను వర్తింపజేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, ప్రత్యేక ప్రస్తావన కింద ఆయన ఈ అంశంపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పాత పెన్షన్‌లో ప్రస్తావన ఉంటే ఉద్యోగి దానికి అర్హుడని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారికి పాత పెన్షన్‌ను వర్తింపజేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. రెండేండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ వారికి రావాల్సిన బకాయిలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో అనేక మంది సకాలంలో వైద్యం అందక మరణించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలను ఒకేసారి చెల్లించాలని కోరారు. విద్యార్థులకు డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు మరింత పెంచాలనీ, ఆరోగ్య కార్డుల ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆధార్‌ లింక్‌ చేయని ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -