Thursday, October 30, 2025
E-PAPER
Homeబీజినెస్ఆప్టిమో క్యాపిటల్‌ రూ.150 కోట్ల నిధుల సమీకరణ

ఆప్టిమో క్యాపిటల్‌ రూ.150 కోట్ల నిధుల సమీకరణ

- Advertisement -

హైదరాబాద్‌ : డిజిటల్‌ ‘లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రాపర్టీ’ (ఎల్‌ఏపీ) ఫిన్‌టెక్‌ సంస్థ అయినా ఆప్టిమో క్యాపిటల్‌ తాజాగా రూ.150 కోట్ల (17.5 మిలియన్‌ డాలర్లు) నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని సిరీస్‌ ఏ రౌండ్‌లో అందు కున్నట్టు పేర్కొంది. ఈ రౌండ్‌కు సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టి నేతృత్వం వహించగా ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు బ్లూమ్‌ వెంచర్స్‌, ఓమ్నివోర్‌లు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తల ఆస్తిని పూచీకత్తుగా ఉపయోగించుకుని తక్కువ వడ్డీకే రుణాలు జారీ చేస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. కేవలం 18 నెలల్లోనే ఆప్టిమో రూ.350 కోట్ల లోన్‌ బుక్‌ను చేరిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ ప్రశాంత్‌ పిట్టి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -