నవతెలంగాణ – బీర్కూర్ నసురుల్లాబాద్
సేంద్రియ సాగుతో పర్యావరణ పరిరక్షణకు మేలు చేకూరుతుందని బాన్సువాడ వ్యవసాయ శాఖ ఏడీఏ అరుణ తెలిపారు. సోమవారం బీర్కూర్ రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సేంద్రియ సాగు, రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా ఉంటూ, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో (కంపోస్ట్, వర్మీకంపోస్ట్) చేసే సాగుతో ఇది నేల సారాన్ని పెంచి, నీటి కాలుష్యాన్ని తగ్గించి, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని, భూమిని ఆరోగ్యంగా ఉంచిన వారము అవుతామన్నారు. సహజ వనరులతో పంటలను పండించాలన్నారు. సేంద్రియ సాగుతో భూమి సారాన్ని పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చన్నారు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తూ రాయితీ అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సులో ఇన్ఛార్జి ఏవో శివకుమార్, సర్పంచ్ ధర్మతేజ, ఏఈవో మీనా, ఉప సర్పంచ్ పరమేష్ ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణలో సేంద్రియ సాగు చెయ్యాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



