Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం: నుడా చైర్మన్ కేశవేణు 

మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం: నుడా చైర్మన్ కేశవేణు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తిగోపి ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియన్ నాయకుడు కొండపాక రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యారు. శిబిరం సక్సెస్ చేసినందుకు కాలనీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రామర్తి గోపి ధన్యవాదాలు తెలియజేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేశారు. శ్రీ చక్ర ఆసుపత్రి

జనరల్ ఫిజీషియన్ విశ్వతేజ్, గ్రీష్మ రుమటాలజీ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు రవి కిరణ్, శ్రీ చక్ర ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ హర్షవర్ధన్ గౌడ్, తక్ష హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాహుల్, శైలజ ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణులు శైలజ, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అశ్విన్, దంత వైద్య నిపుణులు శిరీష శిబిరంలో ప్రజలకు వైద్యచికిత్సలు అందజేశారు. 27వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ గౌడ్, స్థానిక ప్రజలతోపాటు రామర్తి గంగాధర్, ఆది శీను, గాండ్ల లింగం, అవిన్, విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -